స్పీడ్‌ పెంచిన ఉపేంద్ర‌ భార్య!

తెలుగు, క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు ఉపేంద్ర‌. ఒక‌ప్పుడు వైవిధ్య‌మైన చిత్రాలు తీసి అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. అయితే కొన్నాళ్ళుగా తన సినిమాల‌లో కాస్త స్పీడ్ త‌గ్గించాడు.  కాని ఆయ‌న భార్య ప్రియాంక మాత్రం చాలా స్పీడ్ మీదున్న‌ది. గ‌త ఏడాది చిన్నారి అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చింది. తెలుగు, క‌న్న‌డ‌లో ఏక‌కాలంలో రూపొందిన ఈ చిత్రానికి లోహిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హ‌ర‌ర్ నేప‌థ్యంలో చైల్డ్ సెంటిమెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్కింది. ఇక ఇప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైది ప్రియాంక‌. 2004లో ప్రియాంక న‌టించిన జ‌న‌నం అనే చిత్రం విడుద‌ల కాగా, 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్రియాంక మ‌ళ్ళీ త‌మిళ చిత్రంలో న‌టించ‌నుంది. హౌరా బ్రిడ్జ్ అనే టైటిల్ తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఈ మూవీ కోల్‌క‌తాలో జ‌రిగిన రియ‌ల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంగా తెర‌కెక్క‌నుంది. థ్రిల్ల‌ర్ మూవీగా రూపొంద‌నున్న ఈ చిత్రానికి లోహిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. త‌మిళ, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇక ఇదిలా ఉంటే ఉపేంద్ర‌- ప్రియాంక‌ల కూతురు ఐశ్వ‌ర్య కూడా త్వ‌ర‌లోనే వెండితెర ఆరంగేట్రం చేయ‌నున్న‌ట్టు టాక్‌.