సుష్మా పాత్రలో టబు!

పాకిస్థాన్‌కు చెందిన తాహిర్‌ అనే వ్యక్తి బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్న ఉజ్మా అహ్మద్‌ అనే భారతీయురాలికి సుష్మాస్వరాజ్‌ సాయం చేసి తిరిగి భారత్‌ రప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉజ్మా అహ్మద్‌ జీవితాధారంగా బాలీవుడ్‌ దర్శకుడు ధీరజ్‌ కుమార్‌ బయోపిక్‌ తీయబోతున్నారు. ఇందులో రీల్‌ లైఫ్‌ ఉజ్మా పాత్రలోపరిణీతి చోప్రా, ఆమెను భారత్‌ రప్పించడానికి సాయం చేసిన సుష్మాపాత్రలో టబు నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇక భారత డిప్యూటీ హైకమిషనర్‌ జేపి.సింగ్‌ పాత్రలో అనిల్‌కపూర్‌ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే మొదలుకానుంది.