సీతారామ ప్రాజెక్టు పురోగతిపై హరీష్‌ సమీక్ష

రాష్ట్రంలోని కోటిఎకరాలను సాగులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని జలసౌధలో సీతారామ ప్రాజెక్టు పురోగతిపై మంత్రి హరీష్‌ రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావుతో పాటు తుమ్మల, ఎంపీ పొంగులేటితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.