సీఎం కేసీఆర్ సంకల్పాన్ని అడ్డుకోలేరు

అభివృద్ధిని అడ్డుకునేందుకు అత్యధిక కేసులు వేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ కే దక్కుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఎన్ని కేసులు వేసినా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ సంకల్పాన్ని అడ్డుకోలేరన్నారు. వ్యవసాయం గురించి కనీస అవగాహన లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ కు వచ్చిన అవార్డుపై స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ నేతలకు సరైన గుణపాఠం నేర్పుతారని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

హైదరాబాద్ లోని టిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.