సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరెలు పంపిణీ చేస్తమన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇందుకు కృతజ్ఞతగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పెద్దసంఖ్యలో మహిళలు పాలాభిషేకం చేసారు.మహిళల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సీఎం కేసీఆర్..ఆడబిడ్డలకు చీరెలు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు.