సిర్సాలో పాక్షికంగా కర్ఫ్యూ ఎత్తివేత

అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీం సింగ్ దోషిగా తేలడంతో.. రణరంగంగా మారిన సిర్సా ప్రాంతం. క్రమంగా కోలుకుంటోంది. ఈ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పాక్షికంగా కర్ఫ్యూను ఎత్తివేశారు. ఆరు రోజుల తర్వాత.. పాఠశాలలు, కాలేజీలు తెరుచుకున్నాయి. నిత్యావసరాల కోసం ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ప్రస్తుతం సిర్సాలో పరిస్థితి మెరుగ్గా ఉందని, త్వరలోనే పూర్తి స్థాయి కర్ఫ్యూ ఎత్తివేస్తామని అధికారులు చెప్తున్నారు. సిర్సాలోనే   డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం ఉండటంతో.. అక్కడ పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీంతో పెద్ద ఎత్తున బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.