శ్రద్ధా అబద్దం చెప్తుందా?   

తెలుగుతో పాటు కన్నడం, హిందీ, మలయాళం, బెంగాలీ భాషల్లో నటించిన క్రెడిట్ కూడా దక్కించుకున్న శ్రద్ధా… ఈ మధ్యకాలంలో వచ్చిన ఓ మంచి ఆఫర్ ను మిస్ చేసుకుందట. కొద్ది వారాల క్రితం మొదలైన తెలుగు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం శ్రద్ధా కాలింగ్ బెల్ కొట్టిందట. అర్చన, హరితేజ, ముమైత్ ఖాన్‌తో పాటు శ్రద్ధా దాస్ పేరును కూడా ఎంపిక చేశారట నిర్వాహకులు. ఆమె ఒప్పుకోవడమే ఆలస్యం.. పూణె తీసుకెళ్లి శ్రద్ధాను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించేద్దామని అనుకున్నారట. కానీ ఇందుకు శ్రద్ధా మాత్రం ఒప్పుకోలేదట. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన విషయం నిజమే అని ఒప్పుకున్న హాట్ లేడీ.. ఇతర కమిట్ మెంట్స్ కారణంగానే ఇందుకు అంగీకరించలేదని చెప్పింది.  అయితే ఇప్పటికప్పుడు ఈ ముద్దుగుమ్మ ఖాతాలో పెద్దగా ఆఫర్లు కూడా లేకపోవడంతోఅమ్మడు ఏదో దాస్తోందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. బహుశా మిగతా వాళ్ల కంటే శ్రద్ధా ఎక్కువ పారితోషికం అడిగి ఉంటుందని అందుకే ఆమెను లైట్ తీసుకొని ఉండొచ్చనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి.