శరవేగంగా మిషన్ భగీరథ పనులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిషన్‌ భగీరథ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తామన్నారు. సూర్యాపేట కలెక్టరేట్‌ లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరును కలెక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. రైతు సమన్వయ కమిటీ ఏర్పాటుపై కూడా చర్చించారు.

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.