వైరాలో దోపిడి దొంగల హల్ చల్

ఖమ్మ జిల్లా వైరాలో దోపిడి దొంగలు హల్ చల్ చేశారు. ఏకంగా నాలుగుచోట్ల దొంగతనానికి పాల్పడ్డారు. గాంధీ చౌక్ కు చెందిన మెట్టపల్లి నాగి ఇంట్లో 16 లక్షల నగదుతో పాటు బంగారు దోపిడి జరిగింది. మరో మూడు ఇళ్లలోను భారీగా నగదు, నగలు పోయినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.