వడ్డీ రేట్లు తగ్గించిన ఇండియన్ బ్యాంకు

పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను తగ్గించే విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థలు వరుస కడుతున్నాయ. SBI తో మొదలైన ఈ ప్రక్రియను తాజాగా ఇండియన్‌ బ్యాంక్‌ కూడా ఎత్తుకుంది. పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ఖాతాలో రూ. 50 లక్షల కంటే తక్కువ నగదు ఉంటే వడ్డీరేటును 4శాతం నుంచి 3.5శాతానికి తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది. ‘పొదుపు ఖాతాల వడ్డీ రేట్లలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెడుతున్నాం.. సదరు ఖాతాల్లో రూ. 50లక్షల వరకు నగదు ఉంటే వడ్డీ రేటును 3.5 శాతానికి తగ్గిస్తున్నాం. రూ. 50లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే ఆ ఖాతాలకు వడ్డీరేటు యథావిథిగా 4 శాతం వడ్డీ ఉంటుంది’ అని ఇండియన్‌ బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త వడ్డీరేట్లు ఈ నెల 16 నుంచి అమల్లోకొస్తాయని ఇండియన్‌ బ్యాంక్‌  అధికారులు తెలిపారు.