వచ్చే నెల 13 నుంచి వరంగల్ లో స్పోర్ట్స్ ఫెస్టివల్

వరంగల్ నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ఇండోర్ స్టేడియంలో త్వరలో సింథటిక్ కోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు. హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల (సెప్టెంబర్) 13 నుండి 17 వరకు వరంగల్‌ లో స్పోర్ట్స్‌ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి పలువురికి చెక్కులను అందజేశారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాలను ఆదుకుంటున్నారని చెప్పారు.