86 బంతుల్లో పాండ్యా తొలి సెంచరీ

పల్లెకలె టెస్ట్ లో టీమిండియా బౌలర్ హార్ధిక పాండ్యా శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. లంక బౌల‌ర్ల‌ను చీల్చి చెండాడిన పాండ్యా..కేవ‌లం 86 బంతుల్లో టెస్టుల్లో తొలి సెంచ‌రీ చేశాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగ‌డంతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా భారీ స్కోరు సాధించింది. రెండో రోజు లంచ్ స‌మ‌యానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల‌కు 487 ప‌రుగులు చేసింది. పాండ్యా 108, ఉమేష్ యాద‌వ్ 3 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టికే చివ‌రి వికెట్‌కు 66 ప‌రుగులు జోడించారు. లంచ్ విరామ సమాయానికి  టీమిండియా స్కోర్ 487/9.