రైతు సమన్వయ కమిటీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. 42 మంది సభ్యులతో రాష్ట్రీయ  రైతు సమన్వయ సమితి ,24 మంది సభ్యులతో జిల్లా రైతు సమన్వయ సమితి, 24 మంది సభ్యులతో మండల రైతు సమన్వయ సమితి.. 15 మంది సభ్యులతో గ్రామ రైతు సమన్వయ సమితి  ఏర్పాటు చేయనున్నారు. సమన్వయ కమిటీల ఏర్పాటు.. ఇంఛార్జ్‌ మంత్రుల నియామకానికి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అటు నోడల్‌ ఏజెన్సీగా రాష్ట్ర వ్యవసాయశాఖ ఉండనుంది.  రాష్ట్రస్థాయిలో నోడల్‌ అధికారిగా రాష్ట్రవ్యవసాయశాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ వ్యవహరించనున్నారు. సెప్టెంబర్‌ 9 లోపు ఇంఛార్జ్‌ మంత్రులు.. రైతు సమన్వయ సమితిల ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో నోడల్‌ అధికారులుగా కలెక్టర్లు ఉండనున్నారు. అటు నిజమాబాద్, కామారెడ్డి జిల్లాలకు పోచారం శ్రీనివాసరెడ్డి, జనగాం, వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాలకు కడియం శ్రీహరి, కరీంనగర్, పెద్దపల్లి ఈటెల రాజేందర్, రాజన్నసిరిసిల్లా, జగిత్యాల మంత్రి  కేటీఆర్ ఇంచార్జ్ లుగా వ్యవహరించనున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట హరీష్ రావు, ఆదిలాబాద్, కోమ్ రం భీమ్ ఆసిఫాబాద్ జోగు రామన్న, నిర్మల్, మంచిర్యాల్ ఇంద్రకరణ్ రెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి మహేందర్ రెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జగదీష్ రెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి తుమ్మల నాగేశ్వరావు, మహాబూబ్ నగర్ లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జూపల్లి కృష్ణారావు, జయశంకర్ భూపాలపల్లి, మహాబూబాబాద్ చందులాల్ ఇంచార్జ్ లుగా వ్యవరించనున్నారు.