రాష్ట్రపతి దగ్గర తమిళనాడు పంచాయితీ

తమిళనాడు రాజకీయ పంచాయితీ రాష్ట్రపతి భవన్ కు చేరింది. సీఎం పళనిస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడినా గవర్నర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్రపతి కోవింద్ కు ఫిర్యాదు చేశారు ఆ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేతలు. వెంటనే అసెంబ్లీని సమావేశపర్చేలా గవర్నర్ కు ఆదేశాలివ్వాలని కోరారు. డీఎంకే ఎంపీల వెంట కాంగ్రెస్‌ నేత ఆనంద్ శర్మ, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి.రాజాతో పాటు పలువురు ఉన్నారు.