రాధిక ఫేస్‌బుక్‌ అకౌంట్ హ్యాక్!

ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల సోష‌ల్ సైట్ అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయి. తాజాగా హాట్ అండ్ బోల్డ్ యాక్ట్రెస్ రాధిక ఆప్టే ఫేస్ బుక్ ఎకౌంట్ హ్యాకైంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. ట్విట్ట‌ర్ ఎకౌంట్‌లో త‌న ఫేస్ బుక్ ఎకౌంట్ హ్య‌క్ అయింద‌ని తెలియ‌జేస్తూ, అభిమానులు ఎవ‌రు మెసేంజ‌ర్ ద్వారా త‌న‌కి మెసేజ్‌లు పంపొద్ద‌ని కోరింది. ప్రస్తుతం రాధికా బ‌జార్ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ట్వింకిల్ ఖ‌న్నా స్టార్ట్ చేయ‌బోవు ప్రొడ‌క్ష‌న్ లోను రాధికా ఓ చిత్రం చేయ‌నుంది. ఇందులో అక్ష‌య్ కుమార్, సోన‌మ్ క‌పూర్ ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్నారు. షోర్ ఇన్ ద సిటీ, క‌బాలీ, ఫోబియా, బ‌ద్లాపూర్, మంజీ- ద మౌంటైన్ మేన్, పార్చ్‌డ్ మ‌రియు అహ‌ల్య అనే షార్ట్ ఫిలింతో రాధిక ఫుల్ పాపుల‌ర్ అయింది. తెలుగులో రక్త చ‌రిత్ర‌, లెజెండ్, ల‌య‌న్ మ‌రియు ధోని వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకుంది.