రాజ్యసభ సభ్యులుగా షా, స్మృతి ప్రమాణం

కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలు రాజ్యసభ  సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వీరిద్దరు రాజ్యసభ నుంచి గెలుపొందారు.  స్మృతీ ఇరానీ, అమిత్ షా ల ప్రమాణ స్వీకారానికి పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత అమిత్ షా ఇవాళ బీజేపీ సీనియ‌ర్ నేత అద్వానీ నివాసానికి వెళ్లి ఆయ‌న్ను క‌లిశారు.