రాజకీయాల్లోకి ఉపేంద్ర

కన్నడ నాట మరో ప్రాంతీయ పార్టీ పురుడు  పోసుకోనుంది. ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించే శక్తిసామర్థ్యాలు, ఆలోచనలు ఉన్న వారికి వేదిక కల్పించేందుకు పార్టీని స్థాపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఐతే కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరవచ్చని ఊహగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా బెంగళూరులో ఉన్న సమయంలోనే కొత్త పార్టీ ప్రకటన చేశారు. అత్యంత పారదర్శకంగా పార్టీని నడిపిస్తానని ఉపేంద్ర తెలిపారు. సంప్రదాయ పార్టీలకు భిన్నంగా తమ పార్టీ ఉంటుందన్నారు.