యాదాద్రికి పోటెత్తిన భక్తులు

వరుస సెలవులతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసంతోపాటు ఇవాళ ఆదివారం కావడంతో పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యకళ్యాణం, నరసింహ సుదర్శన హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు.