మున్సిపల్ కార్మికుల సంబురాలు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్‌ కార్పోరేషన్ లో కార్మికులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. కార్మికులు బాణసంచా కాల్చి సంతోషం వెలిబుచ్చారు. కాంగ్రెస్ పాలనలో తమను నిర్లక్ష్యం చేశారని కార్మికులు  మండిపడ్డారు. కానీ, సీఎం కేసీఆర్‌ తమను గుర్తించి, పర్మినెంట్ చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు, పెద్దపల్లి జిల్లా మంథని గ్రామపంచాయతీలో కాంట్రాక్టు లేబర్ గా పని చేస్తున్న 8 మందిని ప్రభుత్వం క్రమబద్దీకరించింది. ప్రభుత్వ ధృవీకరణ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు వారికి అందజేశారు. తమ రెగ్యులరైజ్ చేసిన సీఎం కేసీఆర్ కు మంథని గ్రామపంచాయతీ కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.