ముగ్గురు ఉగ్రవాదులు హతం, 8 మంది భద్రతా సిబ్బంది మృతి

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఎన్ కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉదయం నుంచి కొనసాగిన కాల్పుల్లో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది వీర మరణం పొందారు. ఈ ఉదయం జిల్లా పోలీస్ లైన్స్ వద్ద కాపలాగా ఉన్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడికి దిగారు. దీంతో బలగాలు ధీటుగా సమాధానమిచ్చాయి. దాదాపు పన్నెండు గంటల పాటు హోరాహోరీగా కాల్పులు కొనసాగాయి. ఉదయం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డ నలుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు, మరో నలుగురు పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దాడి ఘటన తెలియగానే అదనపు భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టాయి.