ముంబైలో తగ్గుముఖం పట్టిన వర్షం

నిన్న ముంబై ముంచెత్తిన వాన.. ఇవాళ ఉదయం కాస్త తగ్గుముఖం పట్టింది. లోకల్ రైలు సర్వీసులు, బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. రోడ్లపై నిలిచిన నీటిని అక్కడి అధికారులు తొలగిస్తున్నారు. ముంబై వ్యాప్తంగా రాత్రంతా ఉద్యోగులు కార్యాలయాల్లోనే గడిపారు. ఇప్పుడిప్పుడే తమ నివాసాలకు చేరుకునేందుకు ఉద్యోగులు యత్నిస్తున్నారు. అటు ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలకు మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి ఎవరూ కూడా బయటకు రావొద్దని సూచించారు. ఇక విక్రోలి పరిసరాల్లో వర్షానికి ఓ ఇల్లు నాని కూలిపోయింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.