ముంబైలో ఇవాళ స్కూళ్లకు సెలవు

ముంబైలో భారీ వర్షం కురుస్తున్నది.భారీ వర్షాల ధాటికి రహదారులపై ఎక్కడికక్కడ వరద నీరు చేరుకుంటుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నగర వాసులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముంబైలోని స్కూళ్లు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత 48 గంటలుగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు రైళ్ల రాకపోకలు, వాహన రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచపోయాయి. ముంబై మీదుగా వెళ్లే పలు విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. మరోవైపు వరద సహాయక బృందం, డైవింగ్ టీమ్స్ రంగంలోకి సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.