మహా గణపతిని దర్శించుకున్న మంత్రి ఈటెల

రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరున్ని కోరుకున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకున్ని మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. మంత్రి ఈటెల కుటుంబానికి ఆలయ నిర్వాహకులు సాదరంగా ఆహ్వానం పలికారు. మంత్రిని శాలువాతో సత్కరించారు. ఈటెల కుటుంబం పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.