మళ్లీ పెరిగిన బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. దీంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.31 వేల మార్క్‌ను దాటి రూ.30,450కి చేరుకుంది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ఒకేరోజు రూ.550 పెరిగింది. బంగారంతోపాటు వెండి మరింత పెరిగింది. కిలో వెండి ధర రూ.900 ఎగబాకి రూ.41,100కి చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించడంతో వెండి భారీగా పుంజుకుంది.  సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 0.90 శాతం పెరిగి 1,322.41 డాలర్లు పలికింది. గతేడాది నవంబర్ 9 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి ముగింపు. అలాగే ఔన్స్ వెండి 0.66 శాతం పెరిగి 17.54 డాలర్లకు చేరుకుంది.