మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

మట్టి గణపతి విగ్రహాలను వినియోగించడంలో యావత్ తెలంగాణకు సూర్యాపేట జిల్లా రోల్ మోడల్ నిలవాలని మంత్రి జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా  సూర్యాపేట మున్సిపల్ ఆఫీసులో ఆయన మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. అంతకుముందు గణనాథుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.

కొన్నేళ్లుగా యావత్ ప్రపంచం పర్యావరణం గురించి ఆందోళన చెందుతోందని, ఇందులో వినాయకచవితి పర్వదినం ఉండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. రసాయనాలతో తయారుచేసిన వినాయక విగ్రహాల వల్ల వాతావరణం కలుషితమవుతుందన్నా ప్రమాదాన్ని ప్రజలు గమనించడం లేదన్నారు. మూడేళ్లుగా సూర్యాపేటలో మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఇందులో సూర్యాపేట పురపాలక సంఘంతో పాటు ప్రకృతి ప్రేమికుల పాత్ర వెలకట్టలేనిది ఆయన ప్రశంసించారు.