భారీ వర్షాల దెబ్బకు కబడ్డీ మ్యాచ్ రద్దు

ముంబైలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రొ కబడ్డీ సీజన్‌-5లో మంగళవారం జరగాల్సిన మ్యాచుల్ని నిర్వాహకులు రద్దుచేశారు. షెడ్యూలు ప్రకారం ఈ రోజు బెంగళూరు బుల్స్‌ × యూపీ యోధా, యూ ముంబా – గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ మ్యాచ్‌లు నిర్వహించాలి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ఆటగాళ్లు సకాలంలో స్టేడియం వద్దకు చేరుకోలేదు.