భారత సైన్యలోకి రోబోలు!

భారత సైన్యంలోకి రోబోలు రానున్నాయి. ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు భారత సైన్యం రోబోల సాయం తీసుకోనుంది. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు రోబోలను వినియోగించాలని నిర్ణయించింది. కష్టసాధ్యమైన ప్రదేశాల్లోకి ఆయుధాలను చేరవేసేందుకు రోబోలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. తమకు 544 రోబోల అవసరముందని భారత రక్షణ శాఖకు ఆర్మీ ప్రతిపాదనలు పంపింది. రక్షణ శాఖ నుంచి ఆమోదం కూడా లభించింది. త్వరలోనే ఆర్మీలో రోబోలు సేవలు అందించనున్నాయి.