బెనజీర్ హత్య కేసులో ముషారఫ్ దోషి

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ కు చుక్కెదురైంది. ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి బేనజీర్ భుట్టో హత్య కేసులో ముషారఫ్ ని కోర్ట్ దోషిగా తేల్చింది. ముషారఫ్ దేశం నుంచి పరారైనట్లు కోర్టు ప్రకటించింది. ఆయనను ప్రకటిత నేరస్థుడిగా పేర్కొంది. బేనజీర్ హత్యకు జరిగిన కుట్ర వివరాలు ముషారఫ్‌ కు తెలుసునని, ఆమె హత్యలో ఆయన పాత్ర ఉందని కోర్టు నిర్ధారించింది. బేనజీర్ హత్యకేసులో మరో ఐదుగురు నిందితులు నిర్దోషులని పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు నిర్థారించింది.

2007 డిసెంబరు 27న రావల్పిండిలో బేనజీర్ భుట్టో హత్య జరిగింది. ఎన్నికల సభలో పాల్గొన్న అనంతరం బయటికి వస్తుండగా ఆమెపై తుపాకులు, బాంబులతో దాడి చేసి హత్య చేశారు.