బయటపడుతున్న డేరా బాబా అరాచకాలు

పంచకులలో రెండు రోజుల క్రితం డేరా బాబా అనుచరులు సృష్టించిన విధ్వంసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అత్యాచారం కేసులో గుర్మీత్ ను దోషిగా తేల్చిన తర్వాత….పంచకులలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ డేరా అనుచరులు…బీభత్సం సృష్టించారు. కర్రలు, కత్తులతో ఇంటి ఆవరణలో హల్ చల్ చేశారు. రాళ్లతో ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనంతా ఇంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డయింది. దాడి అనంతరం సీసీటీవీని కూడా డేరా అనుచరులు ధ్వంసం చేశారు.