బంజారాహిల్స్ లో కారు బీభత్సం

హైదరాబాద్‌  బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.  శనివారం తెల్లవారుజామున ఓ బీఎండబ్ల్యూ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారులో ఉన్నవారు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. కారు నంబర్‌ ప్లేటు కూడా తొలగించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కారును పోలీసుస్టేషన్‌కు తరలించారు. కారు యజమానిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు.