ప్రతి చెరువులో చేపలు పెంచుతాం

వచ్చే విడతలో ప్రతి చెరువులో చేప పిల్లలను పెంచుతామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. 6 నుంచి 8 నెలలు నీళ్లు నిల్వ ఉండే చెరువుల్లో తొలి ప్రాధాన్యతగా చేప పిల్లలను వదులుతామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిష్‌ మార్కెట్‌ ఏర్పాటు చేస్తామన్న తలసాని.. గ్రామీణ వ్యవస్థను బాగుపర్చేందుకు సర్కార్ కృషి చేస్తుందన్నారు. ఇక గొర్రెల పంపిణీ కార్యక్రమం బ్రహ్మాండంగా సాగుతోందన్నారు. పంపిణీ చేసిన ప్రతి గొర్రెను కాపాడేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని తెలిపారు.