పాక్‌ క్రికెటర్‌పై ఐదేండ్ల నిషేధం

స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన పాకిస్థాన్ టెస్టు క్రికెటర్ షర్జీల్ ఖాన్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐదేండ్ల నిషేధం విధించింది. ఈ ఏడాది నిర్వహించిన పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(పీసీఎల్)లో షర్జీల్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆ దేశ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ నిర్ధారించింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి ఐదేండ్లపాటు అతనిపై నిషేధం విధిస్తున్నట్లు ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై షర్జీల్ 14 రోజుల వ్యవధిలో బోర్డు నియమించిన స్వతంత్య్ర న్యాయనిర్ణేత వద్ద కానీ స్విట్జర్లాండ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో కానీ అప్పీలు చేసుకోవచ్చని సూచించింది.