పంజాబ్ లో భద్రత కట్టుదిట్టం

అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీం సింగ్ కు రేపు శిక్ష ఖరారుచేయనుండటంతో…పంజాబ్ లో సెక్యూరిటీ  కట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను రెట్టింపు చేశారు. మన్సా ప్రాంతంలో భద్రతను స్వయంగా పర్యవేక్షించారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. అల్లర్లు జరుగకుండా భద్రతా దళాలు చూపిన చొరవను అభినందించారు. వారికి యాపిల్స్ అందించారు. రేపు భద్రతను మరింత పెంచుతామని చెప్పారు సీఎం అమరీందర్.