పంచకుల ఘటనలో కాంగ్రెస్ హస్తం ఉంది

హర్యానాలో జరిగిన హింసాత్మక ఘటనలో కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. దీనిపై విచారణ జరుగుతోందని హింసకు పాల్పడిన వారికి వివరాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. ఐతే హర్యానా ప్రభుత్వం సైతం పంచకులలో కర్ఫ్యూ విధించాల్సిందని…భద్రత విషయంలో కాస్త నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. ఐతే సీఎంను మనోహర్‌ లాల్ కట్టర్‌ ఒక్కరి వల్లే అల్లర్లను అదుపు చేయటం సాధ్యం కాదని…ప్రజలందరూ సహకరించాలని కోరారు.