నేడు లంకతో మూడో వన్డే

శ్రీలంక పర్యటనలో కోహ్లీ సేన మరో వన్డే మ్యాచ్‌ కి సిద్ధమైంది. వరుసగా  రెండు వన్డేలలోనూ  గెలిచిన టీమిండియా.. ఇవాళ జరిగే మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ప్లాన్‌ చేస్తుంది. అటు సొంతగడ్డపై టీమిండియా చేతిలో టెస్ట్‌లతో పాటు వన్డేలలోనూ  వరుసగా పరాజయాలను చవి చూస్తున్న  లంక టీమ్‌.. మూడో వన్డేలోనైన గెలిచి తీరాలని చూస్తుంది. దాంతో ఇవాళ ఇరు జట్ల మధ్య మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. మూడో వన్డేలోనూ టీమ్‌ లో ఎలాంటి మార్పులు చేసే ఛాన్స్‌ లేదు. బ్యాటింగ్‌ అర్డర్‌ లో మాత్రం ప్రయోగాలు తప్పవని కెప్టెన్‌ కోహ్లీ ప్రకటించాడు. మరోసారి రాహుల్‌, జాదవ్‌లకు బ్యాటింగ్‌ ఆర్డర్‌ లో ప్రమోషన్‌ లభించే ఛాన్స్‌  ఉన్నది. ఓపెనర్లు రోహిత్, ధవన్‌ లతో పాటు కోహ్లీ, ధోని ఫామ్‌ లో ఉండడంతో.. బ్యాటింగ్‌ లో టీమిండియా బలంగా కనిపిస్తుంది. రెండో వన్డేలో ఆరు వికెట్లతో చేలరేగిన ధనుంజయను ఈ మ్యాచ్‌ లో  కోహ్లీ  సేన ఎలా  ఎదుర్కొంటన్నదానిపై ఆసక్తిగా  నెలకొన్నది. బౌలింగ్‌ లో  గత  రెండు మ్యాచ్‌ లలోనూ  రాణించిన బుమ్రా, అక్షర్‌, చాహల్‌, భువీల ప్లేస్‌ లలో మార్పులు ఉండకపోవచ్చు.

మరో వైపు ఈ మ్యాచ్‌ లోనైన గెలిచి వరుస పరాజయాలకు చెక్ పెట్టాలని లంక టీమ్‌ ప్రణాళికలు రచిస్తుంది. టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయి విమర్శల పాలైన లంక జట్టు.. వన్డే సిరీస్‌ లోనైన గెలవాలనే పట్టుదలతో ఉన్నది. దాంతో ఈ మ్యాచ్‌ లో టీమిండియాకు గట్టి పోటీ తప్పకపోవచ్చు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న లంక టీమ్‌కు.. కెప్టెన్‌ తరంగపై సస్పెన్షన్‌ వేటు మరింతగా కుంగదీసింది. తరంగ ప్లేస్‌ లో కపుగెదెర తాతాల్కిక  కెప్టెన్‌గా  బాధ్యతలను స్వీకరించాడు. గాయంతో బాధపడుతున్న గుణతిలక, తరంగ స్థానంలో టెస్ట్‌ కెప్టెన్‌ చండిమాల్‌ తో పాటు తిరిమన్నేను టీమ్‌లోకి సెలెక్టె చేశారు. బౌలింగ్‌ లో రెండో వన్డేలో హీరో ధనుంజయతో పాటు మలింగపైనే లంక టీమ్‌ ఆశలు పెట్టుకున్నది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆల్‌రౌండ్  పర్‌ఫామెన్స్‌  ఇస్తేనే.. ఈ మ్యాచ్‌ లో టీమిండియాను లంక టీమ్‌ నిలువరించే ఛాన్స్‌  ఉన్నది.

మూడో  వన్డేకు వాడే  పిచ్‌ స్పిన్నర్లకు  సహకరించే అవకాశమున్నది.  వర్షంతో   రెండో వన్డేకి  అడ్డుపడిన వరుణుడు.. ఈ మ్యాచ్‌కు అడ్డుపడే ఛాన్స్‌  ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.