నిర్ణీత సమయానికి ముందే భగీరథ నీళ్లు

నిర్ణీత సమయానికంటే ముందే మిషన్ భగీరథ మంచినీళ్లు ప్రజలకు అందించాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు సమితుల ఏర్పాటు మీద వెంటనే కసరత్తు ప్రారంభించాలని చెప్పారు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో మిషన్ భగీరథ, రైతు సమితుల ఏర్పాటుపై జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాలులో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాసగౌడ్, అల వెంకటేశ్వరరెడ్డి, గువ్వల బాలరాజు, చిట్టెం రాంమోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.