ఆత్మగౌరవంతో బతికేలా నిరుపేదలకు ఇళ్లు

నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్‌ రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. జంటనగరాల్లో లక్ష డబుల్   బెడ్‌ రూం ఇండ్లు కట్టితీరుతామన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్‌ లో డబుల్ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయతోపాటు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి, పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.