ధ్యాన్‌చంద్‌కు కేంద్ర మంత్రుల‌ నివాళి

నేష‌న‌ల్ స్పోర్ట్స్ డే సందర్భంగా హాకీ ప్లేయ‌ర్ మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజ‌య్ గోయ‌ల్‌, హోంశాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు స్మరించుకున్నారు. ఢిల్లీలోని హాకీ స్టేడియంలో  ధ్యాన్‌చంద్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులర్పించారు. ఆ త‌ర్వాత స్టేడియంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మంత్రులు మాట్లాడారు. స్పోర్ట్స్ క‌ల్చ‌ర్‌తో పాటు క్రీడ‌ల్లో టెక్నాల‌జీ అన్న అంశంపై ప్రసంగించారు. ఈ సందర్బంగా నేష‌న‌ల్ స్పోర్ట్స్ ట్యాలెంట్ సెర్చ్ పోర్ట‌ల్ ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు క్రీడాకారులకు ఖేల్ ర‌త్న‌, అర్జున‌, ద్రోణాచార్య అవార్డుల‌ను బ‌హూక‌రించనున్నారు.