దిగ్విజయంగా 3వ విడత హరితహారం

రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడతలో ఇప్పటి వరకు 20 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. LMD కట్ట దిగువన సీఎం కేసీఅర్ నాటిన మొక్కతో పాటు ప్రజలు నాటిన మొక్కలను మంత్రి ఈటెలతో కలిసి ఆయన పరిశీలించారు.. గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన హరిత హారంలో నాటిన వాటిలో 60 శాతం మొక్కలు బతికాయన్నారు. ఈ దఫా నాటిన 20 కోట్ల మొక్కల్లో 80 శాతం వరకు బతికేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బడుగు బలహీన వర్గాలను అర్థికంగా అదుకు నేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఆ దిశగా మూడు నాలుగు రోజుల్లో ఓ నివేదిక తయారు చేసి సీఎం కేసీఅర్‌కు  సమర్పిస్తామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.