తొలిరోజు భారత్ స్కోరు-329/6

శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ లో భాగంగా మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ ఆరు వికెట్ల న‌ష్టానికి 329 ప‌రుగులు చేసింది. శిఖ‌ర్ ధావ‌న్ 109, రాహుల్ 85, కోహ్లీ 42, అశ్విన్ 31, ర‌హానే 17 ప‌రుగులు చేసి ఔట్ కాగా.. సాహా 13, పాండ్య 1 ప‌రుగులు చేసి క్రీజులో ఉన్నారు.

మూడ‌వ టెస్టులో శిఖ‌ర్ ధావ‌న్ దుమ్మురేపాడు. టెస్టుల్లో ఆర‌వ సెంచ‌రీ న‌మోదు చేశాడు. కేవ‌లం 106 బంతుల్లో 15 బౌండ‌రీల‌తో సెంచ‌రీ పూర్తి చేశాడు. ధావ‌న్‌, రాహుల్ ఇద్ద‌రూ క‌లిసి తొలి వికెట్‌కు 188 ర‌న్స్ జోడించారు. రాహుల్ మ‌రోసారి సెంచ‌రీ మిస్స‌య్యాడు. 85 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద రాహుల్ ఔట‌య్యాడు. రాహుల్ వ‌రుస‌గా ఏడు టెస్టుల్లో ఏడు హాఫ్ సెంచ‌రీలు చేశాడు.

అటు శ్రీలంక బౌల‌ర్లు పుష్ప కుమార 3 వికెట్లు, సంద‌క‌న్ 2, ఫెర్నాండో ఒక వికెట్ తీశారు.