తాండూర్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం

వికారాబాద్ జిల్లా తాండూర్‌లో జరిగిన గణేష్ నిమజ్జన వేడుకలు అంబరాన్నంటాయి. మంత్రి మహేందర్ రెడ్డి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు చిరుతల భజనలు, కోలాటాలతో ఆడిపాడారు. గణపయ్యకు ఘనమైన పూజలు చేసిన భక్తులు అద్భుత రీతిలో సాగనంపారు. అనంతరం కోకట్ వాగులో రాత్రంత గణపయ్యలను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.