మ‌ళ్లీ త‌ల్లి పాత్ర‌ చేస్తోంది!

తెలుగులో వ‌చ్చిన ‘దృశ్యం’ చిత్రంలో అల‌నాటి హీరోయిన్ మీనా త‌ల్లి పాత్ర‌తో రీఎంట్రీ ఇచ్చింది. ఓ టీనేజ్ అమ్మాయికి త‌ల్లిగా, ఓ భార్య‌గా మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించి ప్రేక్ష‌కుల అభినంద‌న‌లు అందుకుంది. ఇప్పుడు తాజాగా ఆమె మ‌ళ్లీ త‌ల్లి పాత్ర‌లో న‌టించ‌నుంది. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతుంది. ఇందులో హీరో చిన్న‌ప్ప‌టి ఎపిసోడ్‌లో త‌ల్లి పాత్ర‌కు మీనాను తీసుకున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్త‌యింద‌ట‌. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.