తమిళంలో రకుల్ జోరు

టాలీవుడ్ లోనే కాకుండా తమిళంలో కూడ రకుల్ స్పీడ్ గా దూసుకెళ్తున్నది తెలుగులో చేతి నిండా మూవీలున్నా కోలీవుడ్ అవ‌కాశాల‌ను ఆమె ఆందిపుచ్చుకుంటున్న‌ది. తమిళంలో కార్తీ సరసన ‘ధీరమ్ అధిగారం ఒండ్రు’ మూవీ చేస్తుంది . సూర్య సరసన కూడా మూవీ ఛాన్స్ కొట్టేసింది. సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో సూర్య హీరోగా ఒక భారీ సినిమా ప్రాజెక్ట్ కు ఏర్పాట్లు చేస్తుండగా ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే విజయ్ సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకున్న రకుల్ క‌న్ను బాలీవుడ్ పై కూడా ఉంచింద‌ని స‌మాచారం. మంచి క‌థ వ‌స్తే బాలీవుడ్ లోనూ చేయాల‌ని ఫిక్స్ అయింద‌ట‌..