డేరా హింసను ఖండించిన రాష్ట్రపతి, ప్రధాని

డేరా స‌చ్చా సౌదా చీఫ్ గుర్మీత్‌ ను రేప్ కేసులో దోషిగా తేల్చ‌డంతో చెల‌రేగిన హింస‌ను రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌ కోవింద్, ప్ర‌ధాని మోడీ ఖండించారు. మూడు రాష్ట్రాల్లో చెల‌రేగిన హింస‌ను రాష్ట్రపతి ఖండించారు. శాంతియుతంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. హింస ప‌ట్ల ప్ర‌ధాని మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. హింస‌ను ఖండించారు. శాంతిని నెల‌కొల్పాల‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. డేరా మద్దతుదారుల హింసపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీ నివాసంలో రేపు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

మ‌రోవైపు, రామ్ ర‌హీమ్‌ సింగ్ కు చెందిన ఆరుగురు ప్రైవేట్ క‌మాండోల‌ను చండీఘ‌డ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలు, పెట్రోల్ క్యాన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంద‌స్తుగా చండీఘ‌డ్ పోలీసులు 81 మందిని అరెస్టు చేశారు. వాహ‌నాల‌కు నిప్పుపెట్టిన అంశాన్ని సీరియ‌స్‌ గా తీసుకున్నామ‌ని, బాధ్యుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టార్ చెప్పారు.