టీ న్యూస్ లక్ష మొక్కల గూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లచ్చగూడెం వాసులు హరితహారంలో రికార్డు సృష్టించారు. టీ న్యూస్‌ ఆధ్వర్యంలో ఒకే రోజు లక్ష మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, టీ న్యూస్ ఎండీ సంతోష్  కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా లచ్చగూడెం ప్రజలు హరితహారానికి హాజరయ్యారు. చేయి చేయి కలిపి కార్యక్రమాన్ని గ్రాండ్‌ సక్సెస్‌ చేశారు. హరితహారాన్ని యజ్ఞంలా నిర్వహిస్తున్న టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ చొరవను ప్రతీ ఒక్కరూ ప్రశంసించారు.

సీఎం కేసీఆర్ ఆశయసాధన కోసం పాటుపడుతున్న టీ న్యూస్ యాజమాన్యానికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.