టి-హబ్ అద్భుతంగా ఉందన్న నేపాల్ ప్రధాని

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ సతీసమేతంగా టీ-హబ్ ను సందర్శించారు. నేపాల్ అధికార బృందంతో కలిసి ఆయన టీ-హబ్ లో కలియదిరిగారు. స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ లకు మంచి ప్రోత్సాహం అందిస్తోందని కితాబిచ్చారు. ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ టి-హబ్ గురించి వివరించారు.