టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్

శ్రీలంకపై ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌లో 3-0 లీడ్ సాధించిన టీమిండియా.. క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టింది. కొలంబోలో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వ‌న్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్ప‌టికే సిరీస్ గెల‌వ‌డంతో టీమ్‌లో మూడు మార్పులు చేశాడు కెప్టెన్ కోహ్లీ. కుల్‌దీప్ యాద‌వ్‌, మ‌నీష్ పాండే, శార్దూల్ ఠాకూర్‌లు టీమ్‌లోకి వ‌చ్చారు. ఈ సిరీస్‌లో మ్యాచ్‌ మ్యాచ్‌ కూ కెప్టెన్ల‌ను మారుస్తున్న శ్రీలంకకు.. ఈసారి స్టాండిన్ కెప్టెన్‌గా మ‌లింగ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అటు ఈ మ్యాచ్ తో మిస్ట‌ర్ కూల్ ధోనీకి 300వ వ‌న్డే కావ‌డం విశేషం. ఈ ఘ‌న‌త సాధించిన ఆరో ఇండియ‌న్ ప్లేయ‌ర్ ధోనీ.