జెన్‌కో తాత్కాలిక ఉద్యోగుల వేతనాలు పెంపు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్ధ జెన్ కో ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జెన్ కో లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు గ్రేడ్లవారిగా వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అటు జెన్ కో లో అబ్జార్ప్ షన్ చేసిన 2,914 మంది ఉద్యోగులను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో కొనసాగించాలని టీఎస్ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీచేసారు. హైకోర్టు  సూచనలను అనుసరిస్తూ.. అబ్జార్ప్ షన్ చేసిన జౌట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు యధాతదంగా జౌట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల విధానంలోనే పనిచేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇక నుంచి ప్రతినెల చెల్లించే వేతనాలకు ఈపీఎఫ్, ఈఎస్ఐను కూడ వర్తింపచేయనున్నారు. ఈపీఎఫ్ 13.15శాతం, ఈఎస్ఐ 4.75శాతంను జెన్ కో ఉద్యోగుకులకు జమచేయనున్నది. ఉద్యోగి సాలరీ నుంచి ఈపీఎఫ్ 12, ఈఎస్ ఐ 1.75శాతం తగ్గించనున్నారు. ఈ విధానం ద్వారా ఆర్టిజాన్ గ్రేడ్ వన్ ఉద్యోగులకు ఎకీకృత వేతనం 19,508 రూపాయలు నిర్ణయించగా.. తాజాగా పెంచిన ఈపీఎఫ్, ఈఎస్ఐలను కలుపుకోని 20, 118 రూపాయలు చెల్లించనున్నారు.గ్రేడ్-2 ఉద్యోగులకు 16,634, గ్రేడ్-3 ఎంప్లాయిస్ కు 13,984, గ్రేడ్-4 ఉద్యోగులకు 12, 217 రూపాయల వేతనాన్ని చెల్లించాలని నిర్ణయించారు. అటు గ్రేడ్ వన్ లో 106, గ్రేడ్ టూలో 1065, గ్రేడ్-3లో 570, గ్రేడ్-4 1,170 మంది ఉద్యోగులకు వర్తించనున్నది.