జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. వంద కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కిందని చెప్పారు. హైదరాబాద్‌ బేగంపేటలో సీనియర్‌ జర్నలిస్టు ఎస్కే జకీర్‌ రచించిన మర్లబడ్డ మొగలి చర్ల బుక్ ను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. త్వరలో జర్నలిస్టులకు  డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కట్టిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోరటి వెంకన్న, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణతో పాటు పలువురు సీనియర్‌ జర్నలిస్టులు పాల్గొన్నారు.