ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‌ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్‌ ప్రాంతంలో భద్రత బలగాలపై ఆటాక్‌  చేశారు. వెంటనే తేరుకున్న బలగాలఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఐతే ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. భద్రత బలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. భద్రత బలగాలకు…ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోవటంతో మరింత ప్రాణనష్టం జరగకుండా భద్రత బలగాలు జాగ్రత్త పడుతున్నాయి.